ఒలింపిక్స్ లో పతక గ్రహీతలు తాము సాధించిన మెడల్ను కొరుకుతూ ఫోటోలకు ఫోజులివ్వడం చూసి ఉంటాం. కాంస్య పతక విజేత షూటర్ సరబ్ జ్యోత్ సింగ్ మాత్రం దయచేసి తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగడం విశేషం. వెంటనే వారికి పానీ పూరీ, భేల్ పూరీ, దోశను వడ్డించారు. పతకం గెలిచిన వెంటనే సరబ్ జ్యోత్ కు అభిమానులు, రిలయన్స్ ఫౌండేషన్ తరఫున నీతా అంబానీ ఘనస్వాగతం పలికారు. 2036లో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ పారిస్ లో ఇండియా హౌస్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.