calender_icon.png 16 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్త రెస్ట్ ఇవ్వండి!

16-03-2025 12:21:07 AM

ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఉంటాయి. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగిపోవడం, ప్రతి విషయంలో సర్దుకుపోవడం, రాజీపడటం, కెరీర్‌పై దృష్టిపెట్టడం.. ఇలా కారణమేదైనా మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. తద్వారా మానసికంగా ఒత్తిడికి గురవుతాం. దాంతో అనుబంధంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా చీటికీ మాటికీ గొడవలు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు చిరాకు పడటం.. ఇలా క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ సన్నగిల్లుతూ వస్తుంది.

ఆ సమయంలో దంపతులిద్దరూ ఇలా తమకంటూ కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవాలి. అందుకు ఇద్దరు సహకరించుకోవాలి. ఫలితంగా ఇద్దరికీ మంచి విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఒకరి పనులను మరొకరు చేయడం వల్ల కూడా విశ్రాంతి లభిస్తుంది. ఎవరికివారుగా సమయం కేటాయించుకోగలిగితే దాంపత్య జీవితం చాలా బాగుటుంది. కాసేపు నచ్చిన పనులు చేస్తే మనసు కూడా పునరుత్తేజితమవుతుంది. అందుకే భాగస్వామికి తగినంత స్పేస్ ఇవ్వాలంటున్నారు నిపుణులు.