మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
కౌడిపల్లి, నవంబర్ 18: కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి బోనస్‌తో పాటు చెల్లింపులు ప్రారంభించామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ఆయన కౌడిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులు, సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. జిల్లాలో సన్నవడ్లకు రైతులకు బోనస్ చెల్లింపు మొదలైందని తెలిపారు. 490 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చప్పారుఈ కార్యక్రమంలో కౌడిపల్లి తహసీల్దార్, సంబధిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.