calender_icon.png 17 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క అవకాశం ఇవ్వండి

17-01-2025 02:08:28 AM

  1. ఢిల్లీ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 
  2. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం 
  3. ఢిల్లీలోనూ అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం 
  4. ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల హామీల పోస్టర్ విడుదల

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు హామీల వర్షం కురిపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే.. రాష్ట్ర ప్రజలకు రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కిట్స్ ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాఖ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌చార్జ్ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో కలిసి తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన హామీల పోస్టర్లను గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని తెలిపారు.  తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తున్నామని, ఢిల్లీలో కూడా చేస్తామని చెప్పారు. అందుకు కాంగ్రె స్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని కోరా రు. ఇదిలా ఉండగా..

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇప్పటికే పలు హామీలను ఇచ్చింది. మహిళల కోసం “ప్యారీ దీదీ యోజన” కాంగ్రెస్ జనవరి 6న ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ నెల రూ.2,500 మహిళ లకు ఆర్థిక సాయంగా ఇస్తామని హామీ ఇచ్చింది. “జీవన్ రక్ష యోజన” కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. ఇక ఢిల్లీలోని నిరుద్యోగ యువత కోసం “యువ ఉడాన్ యోజన” ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ప్రతీ నెల రూ.8,500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.