calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసలు ఇవ్వు.. చెట్లు నరుకు?

19-04-2025 12:44:03 AM

  1. ఇండ్ల నిర్మాణం పేరిట విచ్చల విడిగా తాటి చెట్ల తొలగింపు
  2. వృత్తిని రక్షిస్తున్నామని చెప్తూనే పట్టించుకోని అధికారులు

కరీంనగర్,ఏప్రిల్18(విజయక్రాంతి): ప్రభుత్వం ఒక పక్క కల్లు గీత కార్మికుల కు కాటమయ్య కిట్లను ఇచ్చి వృత్తిని కాపాడే ప్రయ త్నం చేస్తుంటే ఇక్కడి ఆబ్కారీ అధికారులు తాటి చెట్లను  నరికెందుకు ప్రోత్యహిస్తున్నా రు. కరీంనగర్ పరిసిలోని రేకుర్తి లో తాటి సీజేట్లను నరికి భవనాలు నిర్మిస్తున్నారు. సర్వే నెంబర్ 16/1 లోని  అరుగుంటల స్థలంలో ఒక బిల్డర్ తాటి చెట్లను తొలగించి  భవనాలు నిర్మించాలనుకున్నాడు.

ఎలాంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రి తాటి చెట్లను నరికి వేశారు. సంబంధిత పరిధిలోని ఆబ్కారీ సర్కిల్ అధికారికి, గీత కార్మిక  సొసైటీ పెద్దలకు లక్షన్నర కు పైనే ముడుపులు చెల్లించి పనికానించుకున్నాడు. ఈ  విషయం తెలిసుకున్న కొందరు గీత కార్మికులు ఆబ్కారీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

ముడుపులకు అలవాటు పడ్డ ఆబ్కారీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం తో తాటి వబలు అంతరించి పోతున్నాయి. నిజానికి 16/1 సర్బ్ నెంబర్ భూమి సీలింగ్ భూమి ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని కాలని వాసులు ప్రశ్నిస్తున్నారు..

టేకుర్తి  కల్లు కనుమరిగేనా

రేకుర్తి కరీంనగర్ శివారులో ఉంటుంది. ఇక్కడ తాటి వానలు ఉండేవి. కల్లు ప్రియు లు తాటి వనాలలోకి వచ్చి  దావతులు చేసుకోని వెళ్లే వారు. నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.. రేకుర్తి ఒకప్పుడు గ్రామపంచాయతీ గా ఉండేది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కరీంనగర్ కార్పొరేషన్ లో కలిపారు. నగరం విస్తరించడం తో తాటి వనాల జాగలో  బ హుళ అంతస్తులు వెలిశాయి.

అనుమతులు లేకుండా తాటి వనాలను  నరుకుతూ పో తుండటంతో రేకుర్తిలో కల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. గీత కార్మికులు ఇతర ఉపాధి మార్గాలని  ఎతుకుంటున్నారు. గీతా వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వ స్థలలలో తాటి  చెట్లు పెంచాలని వృత్తిదారులు కోరుతున్నారు.