calender_icon.png 27 October, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగమిచ్చి ఆదుకోండి..

27-10-2024 01:19:24 PM

ముఖ్యమంత్రిని వీడియో ద్వారా వేడుకున్న దివ్యాంగుడు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): తనకు ప్రభుత్వ శాఖలో ఏదైనా చిన్నపాటి ఉద్యోగాన్ని కల్పించి ఆదుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిగేటి తిరుపతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చేసిన వీడియో ద్వారా వేడుకున్నాడు. గత ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో ఉద్యోగం కల్పించి ఆదుకుంటానని హామీ ఇచ్చి తనకు అన్యాయం చేసిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను ప్రసారమాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రికి చేరేలా చూడాలని వేడుకున్నారు. తన తల్లి మరణించిందని, తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో తన బాగోగులు చూసుకునేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం పదేళ్లు తిరిగి అలసిపోయానని, ముఖ్యమంత్రి స్పందించి తనకు చిన్నపాటి ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకుంటారన్న భరోసాతో తన ఆవేదనను వీడియో చేశానన్నారు.