మంత్రి దామోదరకు ముస్కు రమణారెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 19 (విజయ క్రాంతి): ఉత్తర తెలంగాణ పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు కాం గ్రెస్ పార్టీ నుంచి అవకాశం కల్పించాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహను అమి గోస్ విద్యాసంస్థల చైర్మన్ ముస్కు రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌కు సంబంధించి పట్టభద్రుల సమస్యలపై కొంతకాలంగా పని చేస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై పార్టీపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అప్పటివరకు క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని రమణారెడ్డికి మంత్రి సూచించారు.
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ను రమణారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందనే ధీమా వ్యక్తంచేశారు.