అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి
హుజూరాబాద్, సెప్టెంబరు 14: రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు పట్టభద్రులు అవకాశం కల్పించి గెలిపిస్తే.. సేవచేసి చూపిస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని అల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్లు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని సూ చించారు. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌ను చూసి ఆకర్షితుడై.. తాను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం ఆయన ఎస్సార్ డిగ్రీ కాలేజీ వాకర్స్‌ను కలిశారు. పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో తనకు సహకరించాలని మద్దతు కోరారు. కార్య క్రమంలో వాకర్స్, విద్యాసంస్థల యాజమాన్యాలు, సేవాసంస్థల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అ ధ్యాపకులు పాల్గొన్నారు.