21-03-2025 12:00:00 AM
సప్తగిరి హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసా ద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్‌గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజా గా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించా రు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం సప్తగిరి చాలా శ్రమ పడ్డాడు. 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు. అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి కనిపించి కనిపించని అందరి దేవు ళ్ళని మొక్కుకున్నాడు. విజయం సాధిస్తే సినిమాని న మ్ముకుని వచ్చిన నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతాను అని చెప్పాడు. ఈసినిమాని హిట్ చేసి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ.. “సిని మా ఫన్ బ్లాస్ట్‌లా ఉంటుంది. 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. కమెడియన్‌గా మీ గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేశాను. హీరోగా మం చి సినిమాలు చేశాను”అన్నారు. హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. “డైరెక్టర్ అభిలాష్ గారి బ్లాక్ బస్టర్ జర్నీ ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ కాబోతుంది. సప్తగిరి గారి ఎనర్జీ ఫ్యాషన్ పాజిటివిటీ అద్భుతం’అన్నారు డైరెక్టర్ మారుతి మాట్లా డుతూ.. “పెళ్లి కాని ప్రసాద్ కథ చాలా బాగుందని తను బిగినింగ్ నుంచి చెప్తూ వచ్చాడు.
ఒకరోజు సినిమా చూపించాడు. బాగా నచ్చింది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ట్రెండీగా ఉంది” అన్నారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాని బ్లెస్ చేసినందుకు బ్రహ్మానందం గారికి, మారుతి గారికి థాంక్యూ’అన్నా రు. ప్రొడ్యూసర్ కేవై బాబు మాట్లాడుతూ.. ‘మీరంతా ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుతారు’ అన్నారు.