calender_icon.png 15 November, 2024 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కండక్టర్లకు ఖాకీ కలర్ క్లాత్‌నే ఇవ్వండి

12-11-2024 12:23:56 AM

ఆర్టీసీ ఎండీకి జేఏసీ విజ్ఞప్తి 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు డ్యూటీ యూనిఫామ్‌కు సంబంధించి ‘ఖాకీ యూనిఫామ్’నే ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జన్నార్‌కు జేఏసీ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ ఏర్పడిన నాటి నుంచి కార్మికులకు చిహ్నంగా గుర్తుండేది ఖాకీ కలర్ అని, ఈ కలర్ కర్తవ్యానికి గుర్తు చేయడంతోపాటు కార్మికులకు రక్షణ కవచంగా ఉం టుందని తెలిపారు. డ్యూటీలో ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, చెమట, మర కలు అన్నింటినీ తట్టుకుని శరీరాన్ని ఖాకీ వస్త్రమే కాపాడుతుందన్నారు. గతంలో ఇచ్చినట్టు కార్మికులకు బ్రాండెడ్ రెమండ్స్ ఖాకీ క్లాత్‌ను ఇవ్వాలని కోరారు.