calender_icon.png 19 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారం గడువివ్వండి

18-04-2025 12:30:11 AM

  1. అప్పటివరకు వక్ఫ్ బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టం: కేంద్రం
  2. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు రెండోరోజు విచారణ
  3. ‘వక్ఫ్ బై యూజర్’ను డీనోటిఫై చేయొద్దన్న ధర్మాసనం
  4. తదుపరి విచారణ మే 5కు వాయిదా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పడానికి వారం రోజుల గడువు కోరిన కేంద్ర ప్రభుత్వం.. అప్పటి వర కు వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో కొత్తగా నియామకాలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈక్రమంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనను కూడా డీనోటిఫై చేయరాదని ధర్మాసనం చేసిన సూచనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

దీంతో ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టం సవాల్ చేస్తూ దాఖలైన 73 పిటిషన్లపై వరుసగా రెండోరోజు గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర  ప్రభుత్వం తరఫున వాదనలు వినిపి స్తూ.. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందన్నారు. ‘చట్టానికి సవరణలు చేయడానికి ముందు మాకు లక్షలాది విజ్ఞప్తులు వ చ్చాయి.

గ్రామాలను, ప్రైవేటు ఆస్తులను వ క్ఫ్‌లుగా తీసుకున్నారు. ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ చట్టంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్టే విధించడమనేది కఠిన నిర్ణయం అవుతుంది’ అని అభిప్రాయపడ్డా రు. అలాగే, వక్ఫ్ చట్ట మార్పులకు సంబంధించిన సవాళ్లకు సమాధానాలు చెప్పడానికి వారం రోజుల సమయం కావాలని ధర్మసనాన్ని కోరారు. అప్పటి వరకు బోర్డు, కౌన్సి ల్‌లో సభ్యుల నియమకాన్ని చేపట్టబోమని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ధర్మాసనం కలగజేసుకుని, మొత్తం చట్టంపై స్టే ఇవ్వబోమని సూచించింది. చట్టంలో కొన్ని అను కూల విషయాలు ఉన్నాయని, చట్టంపై పూ ర్తిగా స్టే విధించబోమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. తాము పరిస్థితి మారిపోవాల ని కోరుకోవడం లేదని .. ఐదేళ్ల వరకు ప్రొవిజన్స్ ఉన్నాయని తమకు తెలుసని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తాము ఎలాంటి నియమకాలు చేపట్టబోమ ని మెహతా స్పష్టం చేశారు. ఒక వేళ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే వాటిని చట్టబ ద్ధంగా పరిగణించబోమన్నారు. దీంతో సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలను రికార్డు చేసినట్టు ధర్మాసనం వెల్లడించింది.

అలాగే, తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని.. ‘వక్ఫ్ బై యూజర్’గా పేర్కొ న్న వాటితోపాటు నోటిఫికేషన్ ద్వారా రిజిస్టర్ అయినవి, డీ నోటీఫై చేయకూడదని ప్ర భుత్వాన్ని ఆదేశించింది. దానికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో విచారణకు మే 5వ తేదీకి వాయిదా వేసింది