calender_icon.png 10 January, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరు వెళ్తున్నారా... పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి

10-01-2025 06:15:10 PM

మీ పక్కింటి వారికి తరచు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోండి 

జాగ్రత్తలు పాటించాలి అంటున్న జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా.. అయితే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఒక మాటగా సమాచారం ఇస్తే బాగుంటుందని జిల్లా ఎస్పీ డి జానకి(SP D Janaki) చెప్పారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. ఊరెళ్తున్నామన్నా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొదని పేర్కొన్నారు. డోర్స్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడితే బాగుంటుందని, ఇంటికి సిసి కెమెరాలు వున్నవారు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటు ఉండాలని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయలన్నారు.

శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ గుర్తించుకొని, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. అందుకని కొత్తవారిపై నిఘా ఏర్పాటు చేయవలెనని చెప్పారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలని, పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితుల సమాచారం పేరుతో వస్తే నమ్మకూడదని కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని, డయల్100 ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.