ప్రజలకు మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రకృ తి, పర్యావరణా న్ని కాపాడాలని, సహజ వనరులు ధ్వంసం కాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జంట నగరాలతోపాటు రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైతే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు. చెరువుల పరిరక్ష ణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. చెరువులు, కుంట లు ఆక్రమణకు గురైతే దాని వెనుక ఎంతటి పెద్దలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం సహజ వనరుల ను కాపాడటమేనని చెప్పారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా ఇక్కడి చెరువు ల రక్షణకు కృషి చేస్తానన్నారు.