calender_icon.png 11 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక హత్య చేయడానికి మహిళలకు అవకాశం ఇవ్వండి: రోహిణి ఖడ్సే

08-03-2025 05:22:22 PM

ముంబై,(విజయక్రాంతి): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే( NCP SP Women's Wing President Rohini Khadse) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu)కు ఒక లేఖ రాశారు. నేటీ సమాజంలో మహిళాలపై జరిగే దారుణాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక హత్య చేసినందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాష్ట్రపత్రికి రాసిన లేఖలో మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రతల పరిస్థితిని చంపాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మహిళలపై నేరాలు ఎక్కవగా పెరుగుతున్నాయని, ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఎత్తిచూపుతూ ఖడ్సే లేఖ రాశారు. భారతదేశ స్త్రీలందరి తరపున ఎలాంటి శిక్ష లేకుండా ఒక హత్య చేసేందుకు పర్మిషన్ ఇవ్వండి అంటూ రోహిణి ఖడ్సే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ లేఖ రాశారు. ప్రస్తుత సమాజంలో కిడ్నాప్, గృహ హింస వంటి నేరాలు మహిళలకు అత్యంత ప్రమాదకరంగా మారాయని పేర్కొంటూ ఆమె ఒక సర్వే నివేదికను కూడా ఉదహరించారు. తమ డిమాండ్‌ను తీవ్రంగా ఆలోచించిన తర్వాత మంజూరు చేస్తారని తాము ఆశిస్తున్నామని రోహిణి ఖడ్సే అన్నారు.