calender_icon.png 15 January, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బంగారం ఇచ్చి..

01-08-2024 03:38:33 AM

నాలుగు లక్షలతో ఉడాయించిన దంపతులు

పటాన్‌చెరు, జూలై 31: కూతురు వివాహం కుదిరిందని, బంగారం పెట్టుకొని 4 లక్షలు ఇవ్వాలని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ఘటన అమీన్‌ఫూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో నివాసం ఉండే రాజరాజేశ్వరి గత రెండు నెలలుగా బీరంగూడ భ్రమరాంబిక కాలనీలో కిరాణా దుకాణం పెట్టుకొని జీవిస్తోంది. ఆమె దుకాణానికి అప్పుడప్పుడు కిరాణా సామగ్రి తీసుకునేందుకు వచ్చే రమణమ్మ, ఆమె భర్త ఇద్దరూ కలిసి జూలై 7న తమ కూతురు పెళ్లికి డబ్బు కావాలని రాజరాజేశ్వరిని అడిగారు.

తమ దగ్గర ఉన్న బంగారం బిస్కెట్‌ను పెట్టుకొని ఎనిమిది లక్షలు ఇవ్వాలని కోరారు. అంత డబ్బు లేదని రాజరాజేశ్వరి రూ.4 లక్షలు ఇచ్చింది. ఐదు రోజుల తర్వాత పెళ్లి విషయం తెలుసుకునేందుకు రమణమ్మకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బంగారు బిస్కెట్‌ను షాప్‌లో పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో దంపతులపై రాజరాజేశ్వరి అమీన్‌ఫూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.