వర్సిటీల రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి లేఖ
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో ఉన్న విశ్వవిద్యాయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ సెవంత్ పే అమలు చేసే విషయంపై తమకు వివరాలు అందజేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కోరింది. ఈ మేరకు ఇటీవల 11 వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖ రాసింది. జీవో 11 ప్రకారం ఎంత మంది అధ్యాపకులు వర్సిటీల్లో పనిచేస్తున్నారు? తదితర సమాచారాన్ని కోరింది. ప్రస్తుతం వర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఫిక్స్‌డ్ రెమ్యు నరేషన్ ఇస్తున్నారు. ఒకవేళ సెవెంత్ పే అములు చేస్తే వారి వేతనం పెరగనుంది. కాగా, వర్సిటీలకు లేఖలు రాయడంపై తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోథ్, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు హర్షం వ్యక్తంచేశారు.