* భరోసా, షీ టీం, కళాబృందం సభ్యులతో జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : మహిళలకు అందించు సలహాలు సూచనలు వారి జీవితంలో స్థిరపడేలా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ జానకి భరోసా, షీ టీమ్, కళాబందం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. చట్టపరంగా మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేలా భరోసా కేంద్రం పనిచేయాలని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, భరోసా ఇన్చార్జి సుజాత, భరోసా సిబ్బంది, షి టీమ్ కలాబందాం సిబ్బంది పాల్గొన్నారు.