calender_icon.png 12 February, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ వివరాలివ్వండి!

11-02-2025 01:39:05 AM

యూనివర్సిటీలకు ప్రభుత్వ ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో వర్సిటీలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రస్తుత 2024 ఏ యూనివర్సిటీకి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎంత వాటికి టోకెన్లు ఇచ్చారు? అనే వివరాలను వర్సిటీల నుంచి తెప్పించుకుంటున్నారు.

ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులకు వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో 12 యూనివర్సిటీల బీఆర్‌వో, టోకెన్ల వివరాలను సేకరించి ప్రభుత్వానికి తాజాగా నివేదించినట్లు తెలిసింది.