* ఎనిమిది వారాలు గడువు
* రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాకు చెందిన విశ్రాంత హెచ్‌ఎంకు ఎనిమిది వారాల్లో పదవీ విరమణానంతర ప్రయోజనాలు అందజేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మండపల్లి జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.వెంకటే శం గతేడాది మార్చి 31న పదవీ విరమణ చే శారు.
వెంకటేశానికి ఇప్పటివరకు బెనిఫిట్స్ అందలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తొమ్మిది నెలలవుతున్నా ప్రభుత్వం పిటిషనర్‌కు బెనిఫిట్స్ అందలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిధుల కొరత కారణంగా వెంకటేశానికి చెల్లింపు ఆలస్యమవు తున్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.