calender_icon.png 11 January, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ప్రాధాన్య పోస్టుల్లో బీసీలకు ఛాన్స్ ఇవ్వండి

11-01-2025 01:43:24 AM

* సీఎం రేవంత్‌రెడ్డికి బీసీనేత లింగంగౌడ్ లేఖ

హైదరాబాద్, జనవరి 10(విజయక్రాంతి): ఎస్‌ఐ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు బీసీ పోలీస్ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని.. వారికి ప్రాధాన్య పోస్టుల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నీ అర్హతలు, సీన్సియార్టీ ఉన్నా.. పదోన్నతులు, పోస్టింగ్ విషయాల్లో బీసీ పోలీస్ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేవలం లాబీయింగ్ చేసే వారికి, రాజకీయ పలుకుబడి ఉన్న కులాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఎంతో ప్రతిభ ఉన్న బీసీ పోలీస్ అధికారులను లూప్ లైన్, వీఆర్‌లో ఉంచుతున్నారని, దయచేసి వారికి ప్రాధాన్యత గల పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరారు.