calender_icon.png 7 February, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12లోగా వివరణ ఇవ్వండి

07-02-2025 12:39:19 AM

  1. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సూచన
  2. పార్టీ నిబంధనల మేరకు స్పందించకపోతే కఠిన చర్యలు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించిన కులగణన సరిగా లేదని, బీసీల జనాభా తగ్గించి చూపించారని ఆరోపించడంతో పాటు కులగణన పత్రాలను కాల్చివేయడంపై పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

అంతే కాకుండా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీసీ సభలో ఒక వర్గాన్ని కింపచర్చేవిధంగా మాట్లాడారని కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై ఈనెల 12లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిబంధనల మేరకు వివరణ రాకపోతే కఠిన చర్యలుంటాయని మల్లన్నను హెచ్చరించింది.