calender_icon.png 18 November, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తింటి ముందు కోడలి 'న్యాయ' పోరాటం

18-11-2024 02:49:46 PM

తన భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ బైఠాయింపు

రామగుండం (విజయక్రాంతి): తన భర్త మరణానంతరం తన ఇద్దరు పిల్లలను తనకు కాకుండా చేసి.. కనీసం భర్త ఆస్తిలో వాటా ఇవ్వకుండా రోడ్డుపాలు చేశారంటూ.. అత్తింటి వారి ఎదుట ఓ కోడలు న్యాయపోరాటంకు దిగింది. కోర్టు ఉత్తర్వులు కూడా తనకు అనుకూలంగానే వచ్చినప్పటికీ.. తన ఆస్తి తనకు ఇవ్వకుండా బేఖాతరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు గోదావరిఖని రమేష్ నగర్ లోని తన అత్తగారింటికి చేరుకున్న కోడలు ఆందోళనకు దిగింది. అనారోగ్యంతో చనిపోయిన తన భర్తకు చెందిన ఆస్తి తనకు ఇవ్వాలని, అంతేకాకుండా తన ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకుంటుంది. ఈ పోరాటంలో ఆమెకు న్యాయం జరుగుతుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.