calender_icon.png 22 January, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంకీ పనితీరుపై నివేదిక ఇవ్వండి

05-07-2024 12:27:06 AM

అడ్‌హక్ కమిటీ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో ఎక్కడి పడితే అక్కడ శానిటేషన్ సమస్య ఉత్పన్నం కావడంతో కొన్నాళ్లుగా రాంకీ పనితీరుపై గ్రేటర్ ప్రజలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న జీహెచ్‌ఎంసీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో గురువారం పలు విభాగాల అడ్‌హక్ కమిటీల సమావేశం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.

సమావేశానికి హాజరైన సభ్యులు గ్రేటర్‌లో చెత్త నిల్వలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో చెత్త నిల్వలు ఎక్కడిపడితే అక్కడే ఉంటున్నాయని అభిప్రాయం వెల్లిబుచ్చారు. ఈ నేపథ్యంలో సభ్యుల అభిప్రాయాల అనంతరం శానిటేషన్ నిర్వహణలో రాంకీ సంస్థ చేపడుతున్న పనులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని అడిషనల్ కమిషనర్‌ను మేయర్ గద్వాల విజయలక్ష్మిఆదేశించారు. సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ ఆటోలకు ఇంకా ఎన్ని అదనంగా కావాల్సి ఉందని అధికారులను అడిగారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ.. శానిటేషన్ విషయంపై రాంకీ సంస్థ చేసుకున్న ఒప్పంద పత్రాలను కార్పొరేటర్లు అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. 

ప్రైమరీ కలెక్షన్ అప్పగించాలని నిర్ణయం.. 

గ్రేటర్‌లో ప్రస్తుతం చెత్త ప్రైమరీ కలెక్షన్ కూడా రాంకీ సంస్థకు అప్పగించాలని, పైలెట్ ప్రాజెక్టుగా మొబైల్ ట్రాలీ బిన్స్ ఏర్పాటు చేయాలని శానిటేషన్ అడ్‌హక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏరియాల వారీగా రాంకీ వాహనాల వివరాలతో పాటు చెత్తను క్లియర్ చేయగానే వాహన డ్రైవర్ సిగ్నేచర్ తీసుకోవడంతో రాంకీపై సరైన పర్యవేక్షణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఅండ్‌డీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వివరాలు టౌన్ ప్లానింగ్ వారి వద్ద ఉండాలని, వీరి ఫోన్ నంబర్లు ప్రజలకు తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.

అయితే, ఏజెన్సీ పనితీరు మెరుగ్గా ఉంటేనే కొనసాగించాలని సమావేశం నిర్ణయం చేసింది. సమావేశంలో కార్పొరేటర్లు డాక్టర్ సురేఖ, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, డాక్టర్ ఆయేషా హుమేరా, మధుసూదన్, శ్రవణ్, మినాజ్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్, రాంకీ, సీఅండ్‌డీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు ఈశ్వర్, సత్య, రఘు తదితరులు పాల్గొన్నారు.