calender_icon.png 26 January, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారిత్రక కట్టడాల పరిరక్షణపై నివేదిక ఇవ్వండి

13-07-2024 12:35:15 AM

కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): గోల్కొండ కోట చుట్టూ గోడ నిర్మాణానికి తీసుకున్న చర్యలతోపాటు నిర్మాణం ఏ దశ లో ఉందో చెప్పాలంటూ కేంద్రానికి శుక్రవా రం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ కోటల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఓ పత్రికలో వచ్చిన కథనంతోపాటు గోల్కొండ సమీపంలో నిర్మాణాలకు ప్రైవేటు సంస్థకు అనుమతులు మంజూరు చేయడంపై పిల్ దాఖలైన విషయం విధితమే.

వీటిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రం దాదాపు 25 చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటు న్నామని కేంద్రం తెలిపింది. గోల్కొండ కోట చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నది. ఈ దశలో ప్రైవేటు వ్యక్తుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రైవేటు స్థలాల్లో ప్రహరీ నిర్మా ణం చేపడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా అందులో జోక్యానికి నిరాకరించింది. ప్రైవేటు స్థలాల్లో జోక్యం చేసుకుంటే చట్టప్రకారం నిర్మాణాలను అడ్డుకోవచ్చంది.