02-04-2025 12:15:37 AM
పార్టీ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల జాబి తాను పార్టీ హైకమాండ్‌కు కూడా పంపించినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా యి. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి మంగళవారం లేఖ రాశారు.
ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ లో చోటివ్వాలంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెంది న ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య మంగళవారం జానారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
కాగా తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడ సామాజిక వర్గాల కు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవలే పార్టీ అధిష్ఠానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రస్తు తం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.