ఖమ్మం, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆకులు కోయడానికి తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ జారి కిందపడి మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సురభి బాబు(53) ఇంటి అవసరాల నిమిత్తం ఆకులు కోసేందుకు తాటి చెట్టు ఎక్కే క్రమంలో జారి కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.