నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు శేఖర్ గౌడ్(45) గురువారం తాటి చెట్టుపై నుండి కిందపడి మృతి చెందినట్లు ఖానాపూర్ పోలీసులు తెలిపారు. ఉదయం గ్రామ సమీపంలో గల తాటి చెట్టు నుండి కల్లు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కాలు జారిపోవడంతో కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను నిర్మల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.