calender_icon.png 30 October, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో మెరిసిన బాలికలు

30-10-2024 11:19:42 AM

కుమురం భీమ్ ఆసిఫాబాద్అసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్ 14 విభాగంలోని క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్, వ్యక్తిగత ఛాంపియన్‌షిప్, 600 మీటర్ల పరుగు పందెంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కే వైష్ణవి ప్రథమ స్థానంలో నిలిచింది. 100, 200 మీటర్ల పరుగు పందెంలో శ్రావ్య ప్రథమ స్థానంలో నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో పాఠశాల విద్యార్థులు నిలిచారు. క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఆర్ సి ఓ గోపి చంద్, పాఠశాల ప్రిన్సిపాల్ రత్నబాయి, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.