calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేలో ప్రతిభ చాటిన బాలికలు

19-03-2025 02:13:26 AM

కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 18 ( విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల చెందిన విద్యార్థినిలు ఇటీవల కాగజ్ నగర్ లో జరిగిన ఆరవ జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటారు. 13 మంది బాలికలు గోల్ మెడల్ సాధించగా 12 మంది ,సిల్వర్ 9 మంది బ్రాంచ్ మెడల్స్ సాధించారు.

దీంతోపాటు 34 మంది విద్యార్థినిలు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడంతో అభినందనలు వెలువెత్తుతున్నాయి. జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రత్నాబాయి, అధ్యాపక బృందం, విద్యార్థినిలు అభినందించారు. క్రీడల పట్ల ఉత్సాహం ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని, విద్యను అందించడంతోపాటు బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.