* అదనపు కలెక్టర్ బిఎస్. లత
జగిత్యాల అర్బన్, జనవరి 29 : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ బిఎస్.లత అన్నారు. బేటి బచావో బేటి పడావో దశాబ్ది ఉత్సవాలు, జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమ దశాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని మిషన్ శక్తి పథకం, మహిళా సాధికారత కేంద్రం, మహి ళా శిశు సంక్షేమ శాఖ అద్వర్యంలో బుధవారం జగిత్యాలలో మహిళలు, పిల్లలతో బైక్, సైకిల్ ర్యాలి నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బిఎస్.లత మాట్లాడుతూ బాల బాలికల లింగ నిష్పత్తి సమానత్వం సాదించేల కషి చేస్తున్నామ న్నారు. బాలికలు అన్ని రంగాలలో రాణిం చాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, అందరు చట్టాలపై అవగాహనతో పాటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తెల్సుకొని సమానత్వంతో ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ రంగా లలో రాణించిన బాలికలను, మహిళలను సన్మానించారు. అనంతరం అదనపు కలెక్టర్ బిఎస్.లత జిల్లా కార్యాలయ సమూహం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి బి.నరేష్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివా స్, ఎస్సీ అభివద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా విద్యాధికారి కే.రాము, ఐసిడీఎస్ సిడిపివోలు, ఇతర అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.