calender_icon.png 1 November, 2024 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి

06-07-2024 12:00:00 AM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్

సంగారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): ఆడపిల్లలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయాధికారి రమేశ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, భారత రాజ్యాంగం, నూతన చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

బాలల హక్కులు, ఆరోగ్యం, సైబర్ నేరాలు, భ్రూణ హత్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కే లలిత కుమారి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సెల్‌ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశం, డీసీపీఓ రత్నం, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, హెచ్‌ఎం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.