calender_icon.png 26 February, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్లలకు స్వేచ్ఛనివ్వాలి

26-02-2025 01:25:39 AM

వనపర్తి టౌన్, పిబ్రవరి  25: ఆడపిల్లలపై  చిన్న చూపువద్దు అడ్డంకులను, కష్టాలను అసమానతలను ఆదిగమిస్తూ ముందుకు సాగాలాని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. .   “భేటీ బచావో -  భేటీ పడావో”వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మ హిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహి ళలకు, మహిళ పోలీసు సిబ్బందితో  ఏర్పా టు చేసిన బైకు ర్యాలీని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వివిధ శాఖల అధికారులతో కలిసి  కార్యక్రమాన్ని జెండా ఊపి  ప్రారంభించారు.

బైక్ ర్యాలీ  జిల్లా పోలీసు కార్యాలయం మైదా నం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించారు.ఈ  సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ... మహిళలు అన్నీ రంగాలలో ఎదుగుతున్నారని, ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వాలని, మగ పిల్లలతో సమానంగా చదివించాలని, అప్పుడే ఆడపిల్లలు మగ పిల్లల తో సమానంగా అన్నీ రంగాలలో దూసుకెళ్లుతారన్నారు. 

నపర్తి జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులలో కేవలం 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని ఈ ఆంతర్యాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయా లన్నారు ఈ కార్యక్రమంలో  వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరావు, వనపర్తి సీఐ, క్రిష్ణ, స్పెషల్ బ్రాం సిఐ, నరేష్  వనపర్తి పట్టణ ఎస్సు, హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సు, జలంధర్ రెడ్డి,   మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి, సుధారాణి,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, రాంబాబు, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, చెన్నామ్మ తామస్, సూపరిండెంట్  అరుంధతి, సీనియర్ అసిస్టెంట్, అప్సర్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్, భాస్కర్, జండర్ స్పెషలిస్ట్, శ్రీవాణి,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.