13-02-2025 06:28:20 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): బాలికలు, విద్యాభ్యాసంతో సాధికారత సాధించాలని, మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ లు, జ్యోతి, మౌనికలు అన్నారు. మేరకు బేటి బచావో, బేటి పడావో, పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 45 రోజుల కార్యక్రమంలో భాగంగా, స్థానిక ఎంజెపి బాలికల పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చైల్డ్ లైన్ సర్వీసెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, బాల్యవివాహాల నిర్మూలన చట్టం 2006, సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్లు, నంబర్లు 100, 1098, 181,1930, రుతుక్రమ, ఆరోగ్య పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్, సుప్రియ, శ్రీదేవి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.