calender_icon.png 18 April, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యలో బాలికల వెనుకంజ

06-04-2025 12:43:03 AM

అబ్బాయిలతో పోలిస్తే తక్కువ

ఉన్నత విద్యలో మాత్రం అమ్మాయిలదే పైచేయి

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): పాఠశాల విద్యలో బాలికలు వెనుకంజలో ఉన్నారు. వారి ప్రవేశాలు అబ్బాయిలకంటే తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఉన్నత విద్యలో మాత్రం గత కొన్నేండ్లుగా అమ్మాయిలే పైచేయి సాధిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకు ఇచ్చిన నివేదికలో విద్యాశాఖ ఈ విషయాన్ని తెలిపింది. ప్రాథమిక విద్యలో బాలికల నమోదు సంఖ్య తక్కువగా ఉంది. 2014 నుంచి 2024 విద్యాసంవత్సరం వరకు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ బాలికల అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. కానీ అబ్బాయిలతో పోల్చుకుంటే తగ్గింది. 2014 1 తరగతిలో బాలికల సంఖ్య 15,45,342 మంది కాగా, 6 తరగతిలో 8,47,708 మంది, 9 5,15,169 ఉంది. మొత్తంగా కలుపుకుంటే ఆ ఏడాదిలో బాలికల సంఖ్య 29,08,219గా నమోదైంది.

2024 చూసుకుంటే 1 వరకు 14,61,850 మంది, 6 వరకు 9,01,873 మంది, 9 60,216 మంది ఉన్నారు. మొత్తంగా 29,23,939 మంది ప్రవేశాలు పొందారు. అప్పటికి ఇప్పటికి 15,720 మంది పెరిగారు. 2015 బాలికల సంఖ్య 29,52,339గా నమోదైంది. 2014 15తో పోల్చుకుంటే 44 వేల మంది అత్యధికంగా ప్రవేశాలు పొందారు. బాలికల సంఖ్య అత్యధికంగా నమోదు కావడం ఒక్క ఆ ఏడాది మాత్రమే. 2016 నుంచి 2023 వరకు బాలికల నమోదు సంఖ్య 29 లక్షలలోపే నమోదైంది. కేవలం గతేడాది అంటే 2024 మాత్రం 29,23,939కు పెరిగింది. బాలికల నమోదు అబ్బాయిలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. 2022 వరకు చూసుకుంటే బాలికల కంటే బాలుర సంఖ్య పెరిగింది.

2022 బాలురు 34,29,508 ఉంటే, బాలికలు 27,85,741 మంది నమోదయ్యారు. ఈ ఏడాదిలో ఏకంగా 6,43,767 మంది అబ్బాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2023 24లో బాలురుల సంఖ్య 31,95,477 కాగా, బాలికల సంఖ్య 28,46,583 ప్రవేశాలు పొందారు. ఈ ఏడాదిలో బాలుర సంఖ్య తక్కువగా నమోదైంది. బాలికల కంటే 3,48,894 మంది ఎక్కువగా నమోదయ్యారు. ఇక 2024 బాలుర సంఖ్య 32,91,310 కాగా, బాలికల సంఖ్య 29,23,939 గా నమోదైంది. బాలికల కంటే బాలుర ప్రవేశాలు ఈ ఏడాదిలో 3,67,371 మంది అత్యధికంగా నమోదయ్యాయి.