- ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన
- హనుమకొండ, పెద్దపల్లి జిల్లాలో ఘటనలు
హనుమకొండ/పెద్దపల్లి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యంతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు బాలికలు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారులు చనిపోయారని ఆరోపిస్తు కుటుంబ సభ్యులు దవా ఖానల ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకివెళ్తే.. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేటకు చెందిన జన్నె రాజుకు సాయిశ్రీ(౬) కూతురు ఉంది. ఆమెకు నాలు గు రోజుల కిందట జ్వరం వచ్చింది. బాలికకు తల్లిదండ్రులు పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. డెంగ్యూ నిర్దారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని డాల్ఫిన్ హాస్పిటల్‌లో చేర్పించారు.
పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. గురువారం ఉద యం బాలిక మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు దవాఖాన ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతు రు చనిపోయిందిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురికి రోగం నయం చేస్తామని రూ.4.5 లక్షలు ఖర్చు వసూలు చేసి శవాన్ని అప్పగించారని ఆరోపించారు. తమ కూతురు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని ఆస్పత్రి ని సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.