- టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక
- కెప్టెన్‌గా హర్మన్, వైస్ కెప్టెన్‌గా మంధాన
- హైదరాబాదీ అరుంధతీకి చోటు
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ను 2009 నుంచి నిర్వహిస్తున్నప్పటికీ మన అమ్మాయిల జట్టు మాత్రం ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. 2020 లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు రన్నరప్‌గా నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఈసా రైనా టీ20 ప్రపంచకప్ సాధించాలని ఆశిద్దాం. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసింది.
హర్మన్‌ప్రీత్ మూడోసారి కెప్టెన్‌గా జట్టును నడిపించనుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికయ్యింది. హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ రెడ్డి జట్టులో చోటు దక్కించుకుంది. ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న జట్టునే దాదాపు ఎంపిక చేసింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న శ్రేయాంక, యస్తికాలకు చోటు దక్కించుకున్నప్పటికీ వీరిద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్‌లను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్‌లో టోర్నీ జరగాల్సి ఉన్నప్పటికీ అల్లర్ల కారణంగా మెగా టోర్నీని యూఏఈకి తరలించారు.
టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. రెండు గ్రూపుల్లో నుంచి టాప్ నిలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నాయి. అక్టోబర్ 17,18వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు.
భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా, శ్రేయాంక, సంజన సజీవన్.