calender_icon.png 7 January, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలపై మారు తండ్రి లైంగిక వేధింపులు

05-01-2025 02:24:33 PM

హైదరాబాద్: అమ్మాయిలపై సవతి మారు తండ్రి(Stepfather) పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన లంగర్ హౌజ్ పోలీస్ పరిధి(Langar House Police Range)లోని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇంట్లో తల్లి లేకపోవడంతో హైదరాబాద్‌ బాలికలకు కష్టాలు ఎదురయ్యాయి. కేసు వివరాల ప్రకారం.. 16, 18 ఏళ్ల వయసున్న బాలికలు తమ తల్లి ఇంట్లో లేని సమయంలో పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఏడుస్తున్న బాలికలను తల్లి చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు తెలుసుకున్న తల్లి లంగర్ హౌజ్ పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికలను వైద్య పరీక్షలకు పంపగా, నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.