- మలేషియాపై భారత్ విజయం
- నేడు కొరియాతో పోరు
- ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ
రాజ్ గిర్: బిహార్ వేదికగా మొదలైన మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ అమ్మాయిల జట్టు అదరగొట్టింది. లీగ్ దశలో భాగంగా సోమవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 ఘన విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సంగీతా కుమారి (ఆట 8వ, 55వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. ప్రీతి దూబే (43వ ని.లో), ఉదితా (44వ ని.లో) గోల్స్ సాధించారు.
విజయంతో టోర్నీని ఆరంభించిన సలీమా టిటే బృందం నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లో కొరియాతో తలపడనుంది. తొలి క్వార్టర్స్ నుంచి ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన అమ్మాయిలు కడవరకు అదే జోరును చూపించారు. ఆట ప్రారంభంలోనే సంగీతా గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే రెండు, మూడు క్వార్టర్స్‌లో ఇరుజట్లు ఎలాంటి గోల్స్ నమోదు చేయకపోయాయి.
అయితే ఆఖరి క్వార్టర్స్‌లో మళ్లీ విజృంభించిన భారత్ మూడు గోల్స్‌తో మెరిసి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. భారత్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోవడం విశేషం. జపాన్, కొరియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో గా ఇరుజట్లు 2 నిలిచాయి. అంతకముందు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల కెప్టెన్లతో కలిసి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.