07-02-2025 01:57:30 AM
ఖమ్మం, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసిన ప్రియుడు ఇంటి ముందు యువతి ధర్నా చేసినట ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడులో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓరుగంటి గోపీచంద్, అదే గ్రామానికి చెందిన గడ్డం త్రివేణి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు.
పెళ్లి చేసుకోకుండా వదిలివేయడంతో త్రివేణి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. అయితే గోపిచంద్‌తోపాటు అతని కుటుంబం ఇంటికి తాళాలు వేసి, వెళ్లిపోయింది.