పెద్దపల్లి,కాల్వశ్రీరాంపూర్,ఆగస్టు(విజయక్రాంతి): ప్రియుడు మోసం చేయడంతో అతని ఇంటిముందు ప్రియురాలు బైఠాయించిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెద్దపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీస్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన దాసరి సౌమ్య(21) అదే గ్రామానికి చెందిన జక్కుల శివకుమార్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూశారని శివకుమార్‌కు సౌమ్య తెలిపింది.
ఇంట్లో వాళ్లను ఒప్పంచి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మంచాడు. తనను పెళ్లి చేసుకుంటే అమ్మనాన్నలు పురుగుల మందు తాగి చనిపోతారని సౌమ్యకు చెప్పి శివ పారిపోయాడు. విషయం తెలుసుకున్న సౌమ్య ఆదివారం శివకుమార్ ఇంటి వద్ద బైఠాయించి, నిరహార దీక్ష చేపట్టింది. దీంతో శివకుమార్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం అందకున్న పోలీస్‌లు అక్కడికి చేరుకుని ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి పీఎస్‌కు తీసుకుపోయారు. ఆమెకు మద్దతుగా గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.