ఎల్బీనగర్, ఆగస్టు 3: ఉరేసుకుని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వెంకటే శ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీనగర్‌కు చెందిన లాలస చందన(18) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. వరంగల్ ఎన్‌ఐటీలో సీటు కోసం ఎదురుచూస్తున్నది. ఏమైందో తెలియదు కానీ శనివారం సాయం త్రం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.