calender_icon.png 16 January, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

06-07-2024 03:19:46 PM

సూర్యాపేట: పిల్లలకు చదువు చెప్పి, క్రమశిక్షణతో పెంచాల్సిన ప్రిన్సిపాల్ తనే క్రమశిక్షణ తప్పిన సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్ విద్యార్థినిలు పట్టించారు. సూర్యాపేట - బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ, కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించి అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమపై చేయి చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆగడాలు విసుగు చెందిన విద్యార్థినుల నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని బైఠాయించారు. దీంతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.