calender_icon.png 15 January, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై ఆత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పరారు

17-07-2024 08:05:05 PM

హైదరాబాద్: మహిళలపై చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు.. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజా హైదరాబాద్ లోని బండ్లగూడలో 15 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడాడు ఓ కామాంధుడు.

ఓ మహిళ భర్త మరణించడంతో 15 ఏళ్ల కూతురుతో కలిసి బండ్లగూడలో అద్దె ఉంటుంది. తల్లి పనికెళ్లగా , సమీపంలోనే ఉండే ఆమె వరుసకు సోదరుడైన ముజీబ్ ఖాన్ బాలిక ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక ఎంత బతిమాలిన వినకుండా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు చికాకుగా ఉండడం చూసిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించడంతో బాలిక ఎడుచుకుంటు జరిగిన విషయం చెప్పింది.

దీంతో తల్లి కోపంతో నిందితుడి తల్లి ఫాతిమా బేగంకు ఫిర్యాదు చేసింది. ఫాతిమ బేగం ఈ విషయమ బయట ఎవరి చెప్పవద్దని బాలికను తన కుమారుడితో రెండో వివాహం జరిపిస్తానని మాట ఇచ్చింది. కొన్ని రోజులకు ఫాతిమా బేగం తన కూతురు, కుమారునితో కలిసి ఇల్లు ఖాళీ చేసి ఫిరాయించారు. దీంతో మహిళ చేసేదేమిలేక బండ్లగూడ పోలీసులను ఆశ్రయించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.