10-03-2025 11:01:48 AM
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత్య (13) మూర్ఛ వ్యాధి కారణంగా మరణించినట్లు సమాచారం. లలిత్య బజార్‌హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందినది. ఆమె హాస్టల్‌లో మృతి చెందిందని పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లమని కోరారు.
పాఠశాలకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం(Principal's negligence) వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేశారు. తమ కుమార్తెను కోల్పోయినందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసన తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.