జహీరాబాద్,(విజయక్రాంతి): జహీరాబాద్ లోని విషాదం చోటుచేసుకుంది. బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులాల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి మృతి చెందింది. ఆదివారం రాత్రి గురుకుల పాఠశాల భవనంలో రెయిలింగ్ నుంచి జారిపడ్డ విద్యార్థిని సాధియా(14) తీవ్రంగా గాయపడింది. గాయపడిన బాలికను జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు బాలికకు ప్రథమ చికిత్స చేయగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కన్నబిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు.