27-03-2025 12:46:45 AM
సిద్దిపేట సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఘటన
సిద్దిపేట, మార్చి 26 (విజయక్రాంతి): నిమోనియాతో బాధపడుతున్న మన్విత (4) సిద్దిపేట పట్టణంలోని సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిందని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స నిర్వహిస్తున్న వైద్యుల నిర్లక్ష్యానికి బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
తమకున్న ఏకైక కూతురును బ్రతికించుకునేందుకు వేలు ఖర్చుపెట్టిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలిక మృతి చెందిందని ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే ప్రాణాలు కోల్పోయిందని బోరుణ విలపించారు.
ఆస్పత్రిలో అడ్మిట్ చేసినప్పటి నుంచి మన్వితకు అస్వస్థత ఉన్నప్పుడు వైద్యున్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో ఉండకపోవడం ఎన్నిసార్లు సమాచారమిచ్చిన బాలికను చూసేందుకు డాక్టర్ సందీప్ రాకపోవడం, తన జూనియర్ డాక్టర్లను మాత్రమే పంపించేవారని తల్లిదండ్రులు తెలిపారు.
డబ్బుల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న సందీప్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో బాలిక మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు.