calender_icon.png 8 October, 2024 | 7:58 AM

వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి!

08-10-2024 12:00:00 AM

ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన

హనుమకొండ, అక్టోబర్ 7 (విజయక్రా ంతి): వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక చనిపోయి ందని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి ఎదు ట ఆందోళనకు దిగిన సంఘటన హనుమ కొండలో సోమవారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామానికి చెందిన జాటోత్ జయపాల్ దంపతుల కూ మార్తె వర్షిత(8)కు డెంగ్యూ సోకడంతో ఈ నెల 2న హనుమకొండలోని డాల్ఫిన్ ఆసు పత్రిలో చేర్పించారు.

ఆదివారం మధ్యా హ్నం తల్లితో మాట్లాడించిన యాజమాన్యం సాయంత్రం విజిటింగ్ అవర్‌లో కలిసే అవ కాశం ఇవ్వలేదు. చిన్నారి వైద్యం కోసం రూ.4 లక్షల వరకు వసూలు చేసిన వైద్యు లు.. చిన్నారి చనిపోయిందనే విషయం చెప్ప కుండా బ్యాలెన్స్ డబ్బులు చెల్లించాలని ఒత్తి డి చేశారు.

ఇంజక్షన్‌కు రూ.53 వేలు వసూ లు చేసిన అనంతరం తల్లిదండ్రులకు చిన్నా రి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో తమ కు న్యాయం చేయాలంటూ బాధితులు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రి ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏ ర్పాటు  చేశారు. బాధితులతో మాట్లాడి న్యా యం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు.