calender_icon.png 23 December, 2024 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రషర్ వద్ద తవ్విన గుంతలో పడి బాలిక మృతి

16-09-2024 07:39:42 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పిప్రి గ్రామ శివారులోని స్టోన్ క్రషర్ లో ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అయితే క్రషర్ వద్ద బండరాళ్ళ కోసం తవ్విన గుంతలో ఇటీవల కురిసిన వర్షానికి భారీగా నీరు చేరి నీటిగుంతల తయారైంది. కాగా సంజన(12) అనే బాలిక అక్కడే ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి గల్లతయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్ళతో బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. బాలిక సంజన మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.