calender_icon.png 1 November, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంపల్లిలో ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో బాలిక మృతి

14-08-2024 09:03:51 PM

మంథని,ముత్తారం(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఆర్ఎంపీ వైద్యం వికటించి, చికిత్స పొందుతూ హైదరాబాద్ లో బాలిక మృతి చెందినట్లు తెలిసింది. ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి ప్రసన్న (17) కు ఇంజక్షన్ వికటించి మృతి చెందింది.

ఈనెల 10వ తేదిన జ్వరంతో ప్రసన్న తండ్రి నారాయణ ఖమ్మంపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బుద్దె రమేష్ వద్ద వైద్యం చేయించగా ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల జ్వరం ఎక్కువ అయింది. దీంతో హైదరాబాద్ కు తరలించగా అక్కడి వైద్యులు ఇంజక్షన్ వికటించడం వల్ల పరిస్థితి విషమించిందని తల్లిదండ్రులకు తెలిపారు. బుధవారం ఉదయం మృతి చెందడంతో హైదరాబాద్ నుండి మృతురాలని తీసుకువస్తున్నారు. ప్రసన్న మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణం అంటూ కుటుంబ సభ్యులు వైద్యుడు ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.