calender_icon.png 17 March, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులతోనే బాలిక ఆత్మహత్య

17-03-2025 04:00:20 PM

బైంసా,(విజయక్రాంతి): ఓ బాలుడు వేధింపులతోనే తమ కూతురు కోమలి (14) ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. భైంసా పట్టణంలో పులె నగర్ కు చెందిన కోమలి అనే బాలిక ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే కోమలిని స్థానిక కాలనీకి చెందిన ఓ బాలుడు(16) కొంతకాలంగా వేధించాడని ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం ప్రాంతీయ ముందు ప్రధాన రహదారిపై మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు. వేధింపులకు పాల్పడిన బాలుడుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఏ ఎస్ పి అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపీనాథ్ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చ చెప్పారు. ఫిర్యాదు మేరకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.